మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మంగళవారం పొదిలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బాప్టిస్ట్ పాలెం, టైలర్స్ కాలనీ, రాజుపాలెం, బుచ్చెన పాలెం మరియు రాంనగర్ కు సంబంధించిన బూత్ లోని బూత్ కమిటీ సభ్యులను నియమించి భవిష్యత్తులో ఏ విధంగా పని పనిచెయ్యాలో పలు సూచనలు చేశారు. అలాగే వచ్చే నెలలో జరిగే తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ ను పర్సనల్ గా కలసి ఓటు అభ్యర్థించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మరియు వార్డులకు సంబంధించి వార్డు నాయకులు పాల్గొన్నారు.