కాంగ్రెస్ పార్టీకి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చత్తీస్ గడ్ ప్రభుత్వమే లక్ష్యంగా మావోయిస్టులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. 2018 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.