ప్రముఖ ఆలయాల్లో స్వామి, అమ్మవార్ల ఉత్సవాలకు ఏనుగులు వినియోగిస్తారు. అవి భక్తులను ఆశీర్వదిస్తూ, ఉత్సవ విగ్రహాలను మోస్తూ వేడుకలో పాల్గొంటాయి. అయితే కేరళ త్రిసూర్ ఆలయంలో ఇక నుంచి ఓ రోబో ఏనుగును వినియోగించనున్నారు. జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’కు చెందిన కొందరు దీన్ని రూపొందించారు. ఇది అచ్చం ఏనుగులానే ప్రవర్తిస్తూ భక్తులను ఆశీర్వదిస్తుందని అక్కడి అర్చకులు తెలిపారు.