బస్ కండక్టర్ రూపాయి తిరిగివ్వకపోవడంతో ఓ వ్యక్తి కోర్టుకెళ్లి విజయం సాధించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రమేశ్ నాయక్ అనే వ్యక్తి 2019లో బీఎంటీసీ బస్సులో ప్రయాణించాడు. టికెట్ ధర పోగా మిగిలిన రూపాయిని కండక్టర్ తిరిగివ్వకుండా అతనిపై కోప్పడాడు. ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో కోర్టుకెళ్లాడు. రూ.2 వేల పరిహారంతో పాటు కోర్టు ఖర్చులకు రూ.1000 ఇవ్వాలని కోర్టు బీఎంటీసీని ఆదేశించింది.