‘‘జగన్ నా ఒక్కడికే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నచ్చారు. అందుకే వైఎస్సార్సీపీకి 151 సీట్లొచ్చాయని సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ కంటే ఆ కుర్రోడికి ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. జగన్ కాన్ఫిడెన్స్ ఎమ్మెల్యేల గురించో, నాలాంటి వాడి గురించో కాదు. ఆయన నమ్ముకుంది ప్రజలను. నా విజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని జగన్ నేరుగా మోదీతోనే చెప్పారు. జగన్ సీఎం సీట్లో కూర్చున్నాక.. ప్రజావ్యతిరేక పనులేమీ చేయలేదు. అభివృద్ధి లేకుండా పప్పు బెల్లాలు పంచుతున్నారేంట్రా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పూటలా అన్నం తినలేని వాళ్లున్నారు. కలం పట్టుకోని వాళ్లున్నారు. పలకా బలపం కొనలేని వాళ్లున్నారు. ఆడ పిల్లలకు ఒళ్లంతా దాచుకునే దుస్తుల్లేని వాళ్లు లక్షల్లో ఉన్నారు. అవన్నీ జగన్ చూశాడు. ముందు వాళ్లకు రెండు పూటలా అన్నం పెట్టాలి.. కట్టుకోవడానికి గుడ్డ, ఉండటానికి గూడు ఇవ్వాలని జగన్ అనుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్రాను ఏమైనా చేయొచ్చని అనుకున్నాడు. ఇవి చేయకుండా.. అదిగో చూడు తాజ్‌మహల్ అంటే ఉపయోగం ఏముంటుంది..? పేదోడికి అన్నం పెట్టలేని అభివృద్ధి ఎందుకు..?’’ అని పోసాని ప్రశ్నించారు.