వివాహ నిశ్చితార్థానికి ముందు రోజు యువతి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ధారుణం కర్నూలు జిల్లాలో జరిగింది. సి బెళగల్ మండలం గుండ్రేవులకు చెందిన నారాయణ, వెంకటమ్మల కుమార్తె సరస్వతికి ఇటీవల పెళ్లి సంబంధం చూశారు. ఈ నెల 22న యువకుడితో నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే మంగళవారం సరస్వతి పొలం పనులకు వెళ్లింది. ఈ క్రమంలో మొక్కజొన్న సొప్ప తీస్తుండగా.. అక్కడ గమనించక కింద ఉన్న పామును తొక్కింది.
వెంటనే పాము యువతిని కాటు వేసింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యలో చనిపోయింది. నిశ్చితార్థం తర్వాత నెలాఖరులో పెళ్లి చేయాలని ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు. కానీ ఇంతలోనే పాముకాటుకు గురై యువతి ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. మరో వాదన కూడా వినిపిస్తోంది.. యువతిని పాము కాటు వేసిన వెంనటే కుటుంబసభ్యులు తిమ్మందొడ్డిలో నాటు వైద్యం చేయించారు. కానీ విషం శరీరానికి చేరడంతో నల్లగా మారి ఆమె ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు.