కొంతమంది చిన్నపాటి విషయానికే తీవ్ర ఆవేశానికి లోనై దాడులకు దిగుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు విపరీతంగా దాడి చేసుకుంటారు. పోలీసు చెక్ పోస్టులో పోలీసులు లేకపోవడంతో, దాంట్లోనే కొట్టుకుంటారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఒకరిని ఒకరు చితకబాదుకుంటారు. ఈ ఘటన లక్నోలోని దుబగ్గ ప్రాతంలో జరిగింది.