వైఎస్సార్ లా నేస్తం ఫథకానికి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన 2,011 మంది జూనియర్ లాయర్ల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున మొత్తం రూ.1,00,55,000లను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. లాయర్లకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపేందుకు 'లా నేస్తం' అని సీఎం అన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేల్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు 'లా నేస్తం' ఖచ్చితంగా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు.