వేసవిలో విపరీతమైన వేడి వాహనాలల్లోని ప్లాస్టిక్, రబ్బరు భాగాలను దెబ్బతీస్తుంది. వేసవిలో కారును ఎల్లప్పుడూ నీడలో పార్క్ చేయాలి. కారు విండోలకు సన్‌షేడ్‌ని ఉపయోగించాలి. కారులో ఏసీ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. మీ కారు టైర్లను పర్యవేక్షించండి. వేసవిలో టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది. మీ కారు స్పేర్ టైర్ యొక్క పరిస్థితి, గాలి పీడనాన్ని కూడా చెక్ చేయండి. మీ కారు రేడియేటర్ ను సర్వీసింగ్ చేయండి. బ్యాటరీ సరైన రేటుతో ఛార్జ్ అవుతుందో చెక్ చేయండి. వేసవి రాకముందే మీ కారును పాలిష్ చేయండి.