వేసవిలో ఎండలతో పాటు కరెంట్ బిల్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని టిప్స్ తో తగ్గించుకోవచ్చు. మీ ఇంట్లో అనవసరంగా వాడే కొన్ని పరికరాలను నియంత్రించడం ద్వారా కరెంట్ బిల్ ఆదా చేసుకోవచ్చు. నాన్-ఇన్వర్టర్ ఏసీకి బదులుగా ఇన్వర్టర్ ఏసీని వాడితే దాదాపు 15 శాతం బిల్ సేవ్ చేయవచ్చు. సాధారణంగా వంటగదిలో వినియోగించే చిమ్నీకి బదులు మార్కెట్ లో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. వాటిని వినియోగించడం ద్వారా కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు.