ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సానిపల్లి మంగమ్మ కలెక్టర్ ఆఫీసు నందు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్, శింగనమల, రాప్తాడు, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జొన్నలగడ్డ పద్మావతి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణ, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ శివ రామిరెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ , ఉమ్మడి జిల్లా వైయస్సార్సీపి ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.