చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. బుధవారం 24వ రోజు లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. కోబాక నుంచి లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మోదుగులపాలెం ప్రజలు లోకేష్‌కు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారమని పింఛన్లు రద్దు చేశారని పలువురు మహిళలు... లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ జెండాలు కడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కూడా గ్రామంలో వాలంటీరు ఈ పాదయాత్రకు వెళ్లకూడదని అందరికీ చెబుతున్నారని... వెళ్లిన వారికి పథకాలు రావని బెదిరిస్తున్నారని మహిళలు వాపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa