కొద్దిసేపటి కిందట ఆనందంగా గడిపిన వారు అనంతలోకాలకు వెళ్లారు అంటే ఎవరై ఊహించలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వేడుకకు హాజరై ఆనందంలో ఉన్న వారిని మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదం వారిని మృత్యువు రూపంలో వెంటాడింది. పెళ్లి హాజరై వస్తున్న వారి ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరాడ మండల పరిధిలోని కూనేరు- చోళ్లపదం ప్రధాన రహదారిపై పార్వతీపురం నుంచి రాయ్‌గఢ్ వెళ్తున్న లారీ.. కూనేరు నుంచి కొమరాడ వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ఈ ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే, వీరంతా తుమ్మలవలసలో వివాహ వేడుకకు హాజరై.. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందినది అంటివలస గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.