పీఎం కిసాన్-రైతు భరోసా సాయాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. మాండస్ తుఫాన్‌తో జరిగిన పంట నష్టానికి పెట్టుబడి రాయితీగా రూ.76 కోట్లను అదే రోజు సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేస్తారని ప్రకటించారు. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఫిబ్రవరి 28లోగా రబీ ఈ-క్రాప్ , ఈ-కేవైసీ పూర్తి చేయాలని చెప్పారు హరికిరణ్. వేసవిలో సాగయ్యే పంటలకు మార్చి, ఏప్రిల్‌లో ఈ-క్రాప్ నమోదుకు అవకాశం కల్పిస్తామని.. మార్చి 5 నాటికి వైఎస్‌ఆర్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు బ్యాంకు రుణం, డీలర్లకు కొనుగోలు ఆర్డర్లు జారీ చేయడం పూర్తి చేయాలని సూచించారు కమిషనర్.
మరోవైపు రైతు భరోసా ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించనున్నారు. ఈనెల 27న తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించే సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో మార్కెట్ కమిటీ పరిపాలన భవనంలో కలెక్టరు ఎం. వేణుగోపాల్‌రెడ్డి సమీక్ష చేశారు. ఆయా శాఖల అధికారులకు ఏర్పాట్లకు సంబంధించి కొన్ని సూచనలు చేశాలు.