కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ చరిత్ర సృష్టించింది. మైనస్ 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గడ్డకట్టిన పాంగాంగ్ సరస్సుపై విజయవంతంగా హాఫ్ మారథాన్ నిర్వహించి గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన (సముద్ర మట్టంపై 13,862 అడుగుల ఎత్తు) ఫ్రోజెన్ లేక్‌పై సక్సెస్‌ఫుల్‌గా 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ నిర్వహించి రికార్డు నెలకొల్పింది. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన హాఫ్ మారథాన్.. లుకుంగ్ గ్రామంలో మొదలై మాన్ గ్రామంలో ముగిసింది.