యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తజికిస్తాన్ ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని తజికిస్తాన్ సరిహద్దుకు సమీపంలో గురువారం ఉదయం 10 కి.మీ లోతులో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నివేదించింది. సీఈఎన్సీ ప్రకారం జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ రీజియన్ కు సమీపంలో భూకంపం సంభవించినట్లు చైనా ప్రభుత్వ మీడియా కూడా ధృవీకరించింది.