కర్ణాటక ఆర్టీసీ బస్సులో దారుణం జరిగింది. రామప్ప(25) అనే యువకుడు బస్సులో నిద్రిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. బస్సు విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తోంది. బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులో ఒక దాబా వద్ద మంగళవారం అర్ధరాత్రి ఆగింది. ఈ సమయంలో రామప్ప ఓ మహిళపై మూత్రం పోశాడు. మహిళ కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు, బస్ డ్రైవర్, కండక్టర్ వచ్చి నిందితుడిని దూషించి, బస్సు నుంచి దించేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa