యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీసమేత నారసింహుడు మత్స్యావతారంలో స్వామీ వారు భక్తులకు దర్శనమిచ్చారు. 11రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు వచ్చే నెల 3వ తేదీన ముగుస్తాయి. గురువారం ప్రధాన ఆలయంలో మొదట దాదాపు రెండు గంటలపాటు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపారాయణాలు, వేదపండితుల చేత మహోత్సవాన్ని కన్నుల పండువగా, వీనుల విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.