‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’(బీసీఐ) గుర్తింపు లేని వర్శిటీల్లో ‘లా’ కోర్సులను పూర్తి చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోమని బీసీఐ ప్రకటించింది. విదేశీ వర్శిటీల్లో చదివే ‘లా’ డిగ్రీ, భారతీయ వర్శిటీలు జారీ చేసిన ‘లా’ డిగ్రీతో సమానం కాదని తెలిపింది. అక్కడ ‘లా’ చేసిన భారత విద్యార్థులు ఇక్కడ బ్రిడ్జి కోర్సుల ద్వారా పూర్తిస్థాయి ‘లా’ చదవాలని స్పష్టం చేసింది. అనంతరం బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకొని, ప్రాక్టీస్ చేసుకోవచ్చని పేర్కొంది.