భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ మోనికా కెనడీ అన్నారు. తమ దేశంలోని విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్ధులకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. విశాఖలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యావకాశాలపై ఎడ్యుకేషన్ ఫెయిర్ గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆస్ట్రేలియన్ ట్రేడ్ కమిషనర్ మోనికా కెనడీ ముందుగా గీతం అధ్యక్షుడు ఎమ్. శ్రీభరత్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గీతం అధ్యక్షుడు. శ్రీభరత్ మాట్లాడుతూ ప్రపంచశ్రేణి విద్యాలయంగా గీతంను తీర్చిదిద్దడానికి నిర్ధేశించుకున్న లక్ష్యాలను వివరించారు. గీతంలో బోధన, పరిశోధన, కోర్సుల వివరాలను వెల్లడించారు. గీతం విద్యార్ధుల ఉన్నతికి దోహదపడే అన్ని విద్యాసంస్థలతో మేధో సంబంధాలకు ఆసక్తితో ఉన్నామన్నారు గీతం కెరీర్ సర్వీసెస్ అసోసియేట్ డీన్ కమాండర్ గురుమూర్తి గంగాధరన్ మాట్లాడుతూ గీతం విద్యార్ధుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు విదేశీ విద్యాలయాలలో ఉన్నత విద్యావకాశాలపై అవగాహనకు ఇటువంటి ఎడ్యుకేషన్ ఫెయిర్‌లు నిర్వహిస్తున్నామన్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, టాస్మేనియా, జేమ్స్‌కుక్, యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా, డెంకిన్ యూనివర్సిటీ, ఫ్లిండర్స్ యూనివర్సిటీ, మాక్వారి యూనివర్సిటీ, బాండ్ యూనివర్సిటీ, మోనాష్ యూనివర్సిటీ, యుటిఎస్ యూనివర్సిటీ వంట ిప్రముఖ వర్సిటీల ప్రతినిధులు తాముం అందించేవివిధ కోర్సులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ట్రేడ్ కమిషనర్ మోనికా కెనడీ, సంతోష్ కర్ణానందలను గీతం అధ్యక్షుడు ఎమ్. శ్రీభరత్ సన్మానించారు. సిఎ. శ్రీరామ్, డాక్టర్ బి. రవికాంత్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహించారు.