ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆమ్ ఆద్మీ పార్టీ మరియు పీటిఎల్యూ ఉమ్మడిగా బలపరిచిన కాళ్ళ లోకనాథం బుధవారం నామినేషన్ వేశారు. విశాఖ జీవీఎంసీ ఎదురుగానున్న గాంధీ విగ్రహం నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ తో కలిసి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్ళి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థి లోకనాధం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర గళం శాసనమండలిలో వినిపించేందుకు పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీటిఎల్యూ నాయకులు రాష్ట్ర ఉప అధ్యక్షులు బట్టు శ్యామ్ ప్రసాద్, కో ఆర్డినేటర్ కిరణ్ కుమార్ రాజు, ఊమెన్ కన్వీనర్ రూబీ జీనా, విశాఖ కన్వినర్ కోట్ల గణేష్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ షీతల్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ నిమ్మకాయలు భాస్కర్, విజయనగరం జిల్లా కన్వీనర్ కె. దయానంద్, వైజాగ్ కన్వీనర్ షేక్ నాగూర్, శ్రీకాకుళం కన్వీనర్ సునీల్, రాజాం కన్వీనర్ పైల సురేష్, అనకాపల్లి కన్వీనర్ హరనాధ్ బాబు, యువత పాల్గొన్నారు.