గాజువాక నియోజక వర్గ పరిధిలోని 70వ వార్డ్ శ్రామికనగర్ లో బీజేపి కార్యాలయం నుండి పీవీఎన్ మాధవ్ నామినేషన్ వేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం కు బీజేపి గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్బంగ నరసింగరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కేవలం బీజేపి వలనే సాధ్యమని, గతంలో ఎమ్మెల్సీ గా విశేష సేవలందించిన జననేత పీవీఎన్ మాధవ్ కి పట్టభద్రులు అందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దేనంకొండ కృష్ణంరాజు, ఉత్తరాంధ్రా మహిళా మోర్చా ఇంచార్జ్ రోహిణి, రాష్టృ మహిళామోర్చా నాయకురాలు జిలకర్ర భువనేశ్వరి, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు , 74వ వార్డు అధ్యక్షులు మాజీ బీజేపి కౌన్సిలర్ పేర్ల. సత్యారావు, 65వ వార్డు ఉపాధ్యక్షులు రంజిత్, 76వ వార్డు కార్యదర్శి రాజశేఖర్ , 65వ వార్డు కార్యదర్శి వెంకటనారాయణ , రాహుల్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.