దేశంలోని హైవేలపై వాహనం నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాహనాన్ని హైవేపై నిర్ణీత వేగంలో నడపడం మంచిది. ప్రధాన రహదారుల్లోని 4 లేన్లుండగా, ట్రక్కులు, పెద్ద వాహనాలు ఎడమ వైపు లేన్, ఎడమ నుంచి కుడికి రెండో లేన్ బస్సులకు, మూడో లేన్ కార్లు వంటి చిన్న వాహనాలకు ఉంటుంది. వాహనాన్ని లేన్ మార్చే ముందు కచ్చితంగా ఇండికేటర్ ఇవ్వాలి. హైవేపై చాలా దూరం ప్రయాణించేటప్పుడు అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుని ప్రయాణించాలి.