దేశంలో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా సీఎన్ జీ, ఎలక్ట్రిక్ కార్లు వినియోగిస్తున్నారు. సీఎన్ జీ ధరలు ఎక్కువైనప్పటికీ ఈ చిట్కాలు పాటిస్తే డబ్బు ఆదా చెయ్యొచ్చు. సీఎన్ జీ కారుని ఎప్పుడూ నీడలోనే పార్క్ చేయాలి. ఓవర్ ఫిల్ చెయ్యొద్దు. కారులో ఎయిర్ ఫిల్టర్ తనిఖీ చేస్తూ క్రమం తప్పకుండా మార్చుకోవాలి. అలాగే, టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ ఉండాలి. సీఎన్ జీ లీకేజీ కాకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే అధిక మైలేజీ ఇవ్వడం సహా డబ్బు ఆదా అవుతుంది.