ముద్దనూరు మండలం రాజులగురువాయపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ముద్దనూరు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మునిరాజ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల బాగు కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర 5335 రూపాయలతో శనగలను కోనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజుల గోపాల్ రెడ్డి, అశ్వర్ధ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, హరినారాయన రెడ్డి, రైతులు పాల్గొన్నారు.