ప్రముఖ న్యాయవాది, అయిన తోట రాజేంద్రప్రసాద్ కి ఇటీవల కాలంలో నూతనంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మిత్ర సర్వీస్ సొసైటీ, జాతీయ బి. సిసంక్షేమ సంఘం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్ యార్డులో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సామాజిక వర్గాల వారీగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు కల్పించడంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చూపిస్తున్న చొరవ అమోఘమైనదని నాయకులు కొనియాడారు. మొదటినుంచి ప్రజా సమస్యలను పరిష్కార దిశగా అనునిత్యం ఆలోచన చేసే కుటుంబీకుల నుంచి వచ్చిన తోట రాజేంద్ర ప్రసాద్ ను సన్మానం చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి మంత్రి రజని ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రముట్ల నాగేశ్వరరావు, బి. శ్రీను నాయక్, కుంభ నాగేశ్వరరావు, మాదాసు పృథ్వీ సాయి, గుంజి బాలసుబ్రమణ్యం, మాజీ మార్కెట్ డైరెక్టర్ రాచపూడి వెంకట్, మాదాసు తేజ, తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు