కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం జిల్లా కోర్టు ప్రాంగణం నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఆధ్వర్యంలో న్యాయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.పేద ప్రజలకు, సత్వర న్యాయం అందించాలని లక్ష్యంతో, న్యాయ సేవ శిబిరాలు ఏర్పాటు చేయటం జరుగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.