శాంతిపురం మండల పరిదిలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 8 ద్విచక్ర వాహనాలను ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం రాళ్లబూదుగూరు పోలీస్ స్టేషన్ లో బహిరంగ వేలం వేస్తున్నట్లు ఎస్సై మునస్వామి ఒక ప్రకటనలో తెలియచేశారు. వాహనాల వేలంలో పాల్గొనేవారు గురువారం సాయంత్రంలోపు రాళ్ళబూదుగూరు పోలీస్ స్టేషన్ లో ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకువచ్చి 5 వేలు డిపాజిట్ కట్టి పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్సై మునస్వామి తెలిపారు.