'లా'నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు లబ్ధి చేకూరుతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ మేరకు న్యాయవాదుల ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయం ఆవరణలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో జూనియర్ న్యాయవాదులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. న్యాయవృత్తిలోకి చేరి ఎన్రోల్మెంట్ అయిన జూనియర్ న్యాయవాదులకు ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఆదాయం ఉండదని అటువంటి వారికి చేయూతనిచ్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లా నేస్తం పధకం ద్వారా ప్రతినెల 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని అందులో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి 30 వేల రూపాయల నగదును జూనియర్ న్యాయవాదుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. మూడు సంవత్సరాలపాటు వారికి లా నేస్తం పధకం ద్వార లబ్ది చేకూరుతుందన్నారు.