మహిళల ప్రపంచకప్ టీ20లో టీమిండియా కీలక మ్యాచ్‌లో సమరానికి సిద్ధమైంది. కేప్ టౌన్ వేదికగా మరి కాసేపట్లో జరిగే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటివరకు భారత్-ఆస్ట్రీలియాలు ముఖాముఖీ 30 టీ20ల్లో తలపడగా, ఆసీస్‌దే పైచేయి. వాటిలో 22 మ్యాచ్‌లు ఆసీస్ గెలుపొందగా, భారత్ కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. మరో మ్యాచ్ నో రిజల్ట్‌గా ముగిసింది. మరి కీలకమైన ఈ మ్యాచ్ టీమిండియా గెలుపొందుతుందా..? చూడాల్సిందే!