ప్రాచీన భారతదేశం నుంచి వచ్చిన అమూల్యమైన కానుక యోగా. యోగా ఒక వ్యాయామం కాదు, మన జీవన విధానంలో ఒక భాగం. యోగా వల్ల శారీరకంగానూ, మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శివునికి ఇష్టమైన భంగిమ నటరాజాసనం గురించి మీకు తెలుసా..? నటరాజసనం మహాదేవ నృత్య భంగిమల నుంచి ఉద్భవించింది. ఇది భరతనాట్యం ఆధారం కూడా. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్ అండ్ రివ్యూలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, నటరాజాసనం క్రమం తప్పకుండా ప్రాక్టిస్ చేస్తే.. కడుపు సమస్యలు దూరం అవుతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నటరాజాసనం వల్ల కలిగే ప్రయోజనాలు? నటరాజసనం శరీరానికి ఎంతో మేలు చేస్తుందో ఈ స్టోరీ చూసేద్దాం.
ఈ సమస్యలు దూరం అవుతాయి..
ఉదర విస్తరణ
మలబద్ధకం
మూలవ్యాధి
అతిసారం
గుండెల్లో మంట, ఆమ్లత్వం
మూత్ర విసర్జన సమస్యలు
వికారం, వాంతులు
కడుపు నొప్పి
ఆహారం మింగడంలో ఇబ్బంది
కాలిక్యులస్ సమస్య
కడుపులో అల్సర్స్
అన్ని రకాల హెపటైటిస్
ప్యాంక్రియాటైటిస్
పెప్టిక్ అల్సర్
లివర్ సమస్యలు
మూత్రపిండాల సమస్యలు
నటరాజాసనం తుంటి, తొడలపై ప్రభావం చూపుతుంది. ఈ ఆసనం తొడల లోపలి, బయటి భాగాల కండరాలకు వ్యాయామంగా సహాయపడుతుంది. కటి నుంచి పాదాల వరకు కాళ్లలోని ప్రతి కండరానికి టోన్ చేస్తుంది. ఇది పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
ఒత్తిడిని తగ్గిస్తుంది
వెన్నెముకను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది
ఏకాగ్రత పెంచుతుంది
శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.
శరీరం చక్రాలను క్రియాశీలం చేస్తుంది