శరీరంలో విటమిన్ డి తక్కువైతే చాలా సమస్యలు వస్తాయి. ఎముకలు, దంతాలు, కండరాలు బలహీనమవ్వడం. ఒంటి నొప్పులు, పెద్దల్లో ఆస్టియోమలాసియా, పిల్లల్లో రికెట్స్ వంటి సమస్యలు వస్తాయని యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది. విటమిన్ డి లేకపోవడం అనేక సమస్యలు వస్తాయి. అందుకే దీనిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.
విటమిన్ డి తగ్గడం అనేది గుండెకి మంచిది కాదు. దీని వల్ల గుండె సమస్యలు వస్తాయి. అదే విధంగా బీపి ఎక్కువగా ఉంటే విటమిన్ డి కంట్రోల్ చేస్తుంది. విటమిన్ డి లోపం వల్ల క్రానిక్ పెయిన్స్, మజిల్స్ బలహీనంగా మారి నొప్పులు వస్తుంటాయి. త్వరగా అలసిపోతారు. ఎప్పుడు నిద్రమత్తుగా ఉంటుంది.
ఈ లోపం ఉంటే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్, డిప్రెషన్, షుగర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలు విటమిన్ డి లోపం వల్లే వస్తాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరూ విటమిన్ డి తగ్గకుండా చేసుకోవాలి.