నందికొట్కూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీ స్మశాన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రాజకుమార్ శుక్రవారం అమరావతి లోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాల గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఉన్న నిత్యవసర వస్తువులు పెరుగుదల రేట్ల అనుగుణంగా జీతాలు పెంపుదల చేయాలని ఒక వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులతోపాటు ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.