ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భూమిలేని వాలంటీర్ల కుటుంబాలకు పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 1 నుండి వీరికి పింఛను ఇస్తామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి తెలిపారు. అమరావతికి చెందిన కొందరు వాలంటీర్లు పింఛను అంశాన్ని తమ దృష్టికి తెచ్చారని, ఈ సమస్యను సీఎంకు తెలపగా పింఛను ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. దీంతో 200 వాలంటీర్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.