రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో ఏడాది పూర్తైంది. నాటోలే ఉక్రెయిన్ చేరిక, ఇతర కారణాలతో 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించారు. 3 రోజుల్లోనే ఉక్రెయిన్ నగరాలను ఆక్రమిస్తామని పుతిన్ ప్రకటించగా, ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనలతో ఏడాదిగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో 8 వేల మంది సామాన్య ప్రజలు మరణించినట్లు UNO అంచనా వేసింది.