ప్రస్తుత రోజుల్లో ప్రేమికులు అన్నాక తరచూ కలుసుకోవడం మామూలే. అయితే, ఓ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే, ఆమె బంధువులు పట్టుకొని పెళ్లి చేసిన ఘటన ఝార్ఖండ్ లోని బంకా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమికులిద్దరూ గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల యువకుడు యువతిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లగా, బంధువులు పట్టుకొని, పంచాయితీ నిర్వహించి వివాహం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.