ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చెందిన స్నేహితులు గురువారం ఒక పెళ్లి నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో కలిశారు. వీరంతా హైదరాబాద్కు చెందిన తమ స్నేహితుడు దేవరపల్లి బృందావనం గార్డెన్స్ అపార్ట్మెంట్ ప్లాట్లో బస చేశారు. ఖాళీగా ఉండడంతో సరదాగా వారి ఉంటున్న అపార్ట్మెంట్లోనే పేకాట ఆడడం ఆరంభించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా దాడి చేశారు. మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్టు దేవరపల్లి సీఐ అనసూరి శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 6,81,320 నగదు, 4 కార్లు, 14 సెల్ఫోన్లు సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ కె. శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు.