ధవళేశ్వరం, ఏజెన్సీలో గంజాయి కొని రాజమహేందవ్రరం పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్న ముఠాను ధవళేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. గంజాయి అముతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో రెవెన్యూ కాలనీ బరియల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో గంజాయితో ఉన్న రెవెన్యూ కాలనీకి చెందిన వరుపుల లక్ష్మి, అనకాపల్లి రోలుగుంటకు చెందిన బి.చిన అప్పలనాయుడులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.65 లక్షల విలువైన 73 కిలోల గంజాయి, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. గంజాయి అమ్మకంలో వీరికి సహకరిస్తున్న ఉండి రాజేష్, బత్తిన చిట్టిబాబు, ఎస్.శివగోవిందు అలియాస్ రాఖీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.