ఇంటర్ చదువుతున్న బాలికను ఒక యువకుడు మోసగించి తల్లిని చేశాడు. నిడదవోలు మండలంలో ఒక గ్రామానికి చెందిన బాలిక (16)ను అదే గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ పత్తి కిరణ్ (19) ప్రేమిస్తున్నానని నమ్మించి గర్భవతిని చేశాడు. బాలిక నిడదవోలు పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాలిక సమిశ్రగూడెం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ షేక్ సుభానీ ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం బాలిక నిడదవోలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆడశిశువును ప్రసవించినట్టు సమాచారం.