జీ-20 సదస్సు పేరుతో విశాఖ నగర పాలక సంస్థ అధికారులు డివైడర్లపై మొక్కల విషయంలో అధికారుల ఆలోచన ఏమిటో తెలియదు గానీ ఇప్పటివరకు వున్న మొక్కలన్నీ పీకేస్తున్నారు. గత నెలలో సాగర్‌నగర్ మార్గంలో డివైడర్‌పై మొక్కలు కొట్టేయగా, ఇప్పుడు ఆర్కే బీచ్‌రోడ్డులో డివైడర్‌పై మొక్కలు పెకిలించి మరీ తీసేస్తున్నారు. వాటిని రెండు నెలల క్రితం జరిగిన నేవీ డే సందర్భంగా వేశారు. రెండు నెలలు గడవగానే ఇప్పుడు పీకేస్తున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేనివిధంగా బీచ్ రోడ్డులో ఫుట్‌పాత్‌పై రంగులు వెలిసిపోయిన టైల్స్‌కి కలర్స్ వేస్తున్నారు. సదస్సు ప్రారంభమయ్యేలోపు ఇలా ఇంకెన్నిచోట్ల మొక్కలు పీకేస్తారో చూడాలి.