చాలా మందిలో మతిమరుపు కామన్ గా ఉంటుంది. అయితే కొన్ని మ్యాజికల్ ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని అమాంతం పెంచుకోవచ్చు. ముఖ్యంగా హెర్బల్ టీలు తాగడం వల్ల మన బ్రెయిన్ హైడ్రేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో హింగ్, హల్దీ, అజ్వైన్, తులసి టీలు ఉన్నాయి. వీటిని తాగితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అలాగే నూనెకు బదులు నెయ్యి, ఆలీవ్ ఆయిల్ వాడడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుందట.