బీసీ సంక్షేమశాఖ అధికారులు తనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ కింతలి బాలుర వసతి గృహం అటెండర్ పైడి లక్ష్మి నిరసన చేపట్టింది. ప్రజాసంఘ నాయకుడితో కలిసి శ్రీకాకుళంలోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయం ఎదుట బైఠాయించింది. విద్యార్థుల ఫిర్యాదు మేరకు గత ఏడాది లక్ష్మిని బీసీ సంక్షేమశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం పొందూరుకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆమె మెడికల్ లీవ్ పెట్టారు. అయితే, గత సోమవారం ఆమె కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాకుళం బీసీ బాలుర వసతి గృహంలో అటెండర్‌గా లక్ష్మికి పోస్టింగ్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ, అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో పోస్టింగ్ ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె వాపోయింది. కలెక్టర్ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.