ఇల్లు, బాత్రూమ్ ఏదైనా కావొచ్చు, క్లీనింగ్ చేసేటప్పుడు కచ్చితంగా ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుతుందని చెబుతున్నారు. మురికి లేదా బూజు వంటివి శుభ్రం చేసేటప్పుడు మాస్క్ పెట్టుకుంటే లంగ్స్ లో డస్ట్ చేరదని పేర్కొంటున్నారు. అలాగే క్లీనింగ్ స్ప్రేలు వంటి వాడినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఆ రసాయనాల వల్ల ఆస్తమా వంటి సమస్యలొస్తాయని అంటున్నారు.