భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవీసింగ్ షెకావత్ కన్నుమూశారు. మహారాష్ట్ర అమరావతిలోని ఆయన నివాసంలో నేడు ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేవీసింగ్ మరణంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా, మేయర్ గా పనిచేశారు. మరోవైపు ప్రతిభా పాటిల్ దేశ ప్రధమ మహిలా రాష్ట్రపతిగా నిలిచారు. 2007-12 మధ్య రాష్ట్రపతిగా సేవలు అందించారు.