శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మురళీ కృష్ణ కి సిపిఎం మండల కార్యదర్శి రాజగోపాల్ ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సోమందేపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పేరుతో ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి రోడ్డు వెడల్పు చేయడం జరిగిందని, రోడ్డు వెడల్పుతో పక్కనున్న ఇల్లు అన్ని తొలగించి ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు విస్తరణ చేశారు. అయితే డివైడర్ ఎక్కువ వెడల్పు చేసి రోడ్డు తగ్గించారు. దీనివలన బస్సులు పోవడానికి ప్రజలకు, ద్విచక్రవాహనదారులకు చాలా ఇబ్బందిగా వుంది. డివైడర్ ను తగ్గించి ఫుట్ పాతు డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ చాంద్ భాష, ఆవాజ్ మండల కార్యదర్శి అధ్యక్షులు మాబు చేనేత కార్మిక సంఘం మండల నాయకులు గంగరాజు, శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి, భవాని నిర్మాణ కార్మికుడు కే రవి, చేనేత కార్మికులుమహేష్, రామంజి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.