చిన్నగంజాం మండల అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి శుక్రవారం పెదగంజాం గ్రామంలో పర్యటించారు. ఇందులో భాగంగా సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆమె సందర్శించారు. సచివాలయం సిబ్బంది పనితీరును సమీక్షించారు. మధ్యాహ్న భోజనం రుచిని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించారు. అలాగే గ్రామంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీని సందర్శించి త్వరగా నిర్మాణాలు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.