తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎం. ఎల్. సి నియోజకవర్గం నుండి దళిత సమాఖ్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న చీరాలకు చెందిన నీలం శామ్యూల్ మోజెస్ నామినేషన్ పత్రం స్కూటినీలో చెల్లుబాటు అయింది. శుక్రవారం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరి నారాయణ సమక్షంలో నామినేషన్ పత్రాల స్క్రూటీని జరుగుగా శామ్యూల్ మోజస్ పత్రాలు సక్రమంగా ఉండడంతో దాన్ని ఆమోదిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 57 మంది నామినేషన్ దాఖలు చేయగా పలువురి నామినేషన్ పత్రాలు స్క్రూటినీలో తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రాయపాటి జగదీష్ నామినేషన్ కూడా స్కూటినీ లో చెల్లుబాటు కాకుండా పోయింది.