ఓబులవారిపల్లి మండల పరిధిలోని బాలిరెడ్డి పల్లి గ్రామం లోని బాలాజి నగర్ ను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యధర్శి వి. వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాజినర్, శివాజినగర్, బాలిరేడ్డి పల్లి అరుంధతి వాడలో భూమిలేని గ్రామస్తులకు వెంటనే భూ పంపిణి చేయాలన్నారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేనివారికి వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రామానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. శ్రీనివాసులు, జిల్లా కార్యధర్శి పందికాళ్ళ మణి, జిల్లా అద్యక్షులు ఎం. జయరామయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షలు సి. హెచ్ చంద్ర శేఖర్, మండల కార్యదర్శి కె. వెంకటరమణ, కె. కెశవులు, రైతు సంఘం నాయుకులు సి. హరి, రమణ పాల్గొనారు.