నందిగామ పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 4. 11 లక్షల విలువ గల చెక్కులను శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు 384 మంది లబ్ధిదారులకు రూ. 2. 02 కోట్ల రూపాయల చెక్కులు అందజేశామని, 160 మందికి ద్వారా వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సహకారం మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య ఖర్చుల భారం నిరుపేదలపై పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు, వైద్యం చేయించుకున్న వారితోపాటు చేయించుకునే వారికి సైతం సీ. ఎం. ఆర్. ఎఫ్. ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా వైయస్ జగన్ పనిచేస్తున్నారన్నారు. రెండు వేలకు పైగా జబ్బులకు వర్తించేలా ఆరోగ్యశ్రీ పథకంలో సమూల మార్పులు చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 108, 104 వ్యవస్థలను ప్రక్షాళన చేయడంతో పాటు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ 1088 అంబులెన్స్లను ప్రారంభించి దిశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాధించని ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాధించారన్నారు.