ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పులివెందుల ఏడిఏ అశోక్ రెడ్డి తెలిపారు. ముద్దనూరు మండలంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణారెడ్డి తో కలిసి ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ అనుమతులు పొందిన ఎరువులను మాత్రమే విక్రయించాలని, అన్ని రిజిస్టర్లను సక్రమంగా ఉంచాలని ఆయన సూచించారు. ఈ తనిఖీలలో ఆయన దుకాణాల రికార్డులను పరిశీలించారు.